15 సెకన్లు కాదు గంట తీసుకోండి.. BJP ఎంపీ వ్యాఖ్యలకు అసదుద్దీన్ కౌంటర్

by Disha Web Desk 4 |
15 సెకన్లు కాదు గంట తీసుకోండి.. BJP ఎంపీ వ్యాఖ్యలకు అసదుద్దీన్ కౌంటర్
X

దిశ, వెబ్‌డెస్క్: పోలీసులు 15 నిమిషాలు పక్కకు జరిగితే తామేం చేయగలమో చూపిస్తామని అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలపై అమరావతి ఎంపీ నవనీత్ కౌర్ చేసిన కామెంట్స్ తెలంగాణ పాలిటిక్స్‌లో మరోసారి దుమారం రేపుతున్నాయి. ‘15 నిమిషాలు పోలీసులు తప్పుకుంటే మేమేంటో చూపిస్తామని చిన్నోడు (అక్బరుద్దీన్) చెబుతున్నాడు. చిన్నోడికి నేను చెబుతున్నా 15 నిమిషాలు ఎందుకు.. మాకైతే 15 సెకన్లు చాలు అన్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారో.. ఎక్కడికి వెళ్లిపోతారో మీకే తెలియదు అని నవనీత్ రాణా హైదరాబాద్‌లో ప్రచారం సందర్భంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు.’ తాజాగా గురువారం ఈ వ్యాఖ్యలపై ఏఐఎంఐం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ కౌంటర్ ఇచ్చారు. 15 సెకన్లు కాదు గంట సమయం తీసుకోండి.. ముస్లింలను ఏం చేస్తారో చేయండని ఎంఐఎం చీఫ్ సవాల్ విసిరారు. అధికారమంతా మీ దగ్గరే ఉంది.. ఎక్కడికి రమ్మంటే తాము అక్కడికి వస్తామన్నారు. మాటలెందుకు చేసి చూపించండి.. తాము ఇక్కడే ఉన్నాం కదా అని అసద్ సీరియస్ అయ్యారు.

Next Story

Most Viewed