ఈ ఎన్నికలు ఓట్ ఫర్ జిహాద్ Vs ఓట్ ఫర్ డెవలప్‌మెంట్.. అమిత్ షా హాట్ కామెంట్స్

by Disha Web Desk 4 |
ఈ ఎన్నికలు ఓట్ ఫర్ జిహాద్ Vs ఓట్ ఫర్ డెవలప్‌మెంట్.. అమిత్ షా హాట్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: ఈ సారి జరిగే ఎన్నికలు ఓట్ ఫర్ జిహాద్ వర్సెస్ ఓట్ ఫర్ డెవలప్‌మెంట్ అని కేంద్ర హోం మంత్రి అమిత్ షా హాట్ కామెంట్స్ చేశారు. భువనగిరి లోక్‌సభ బీజేపీ ఎంపీ అభ్యర్తి బూరనర్సయ్య గౌడ్‌కు మద్దతుగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో గురువారం అమిత్ షా మాట్లాడారు. కాకతీయ రాణి రుద్రమదేవికి మనస్ఫూర్తిగా ప్రణామం చేస్తున్నా అన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహారాణా ప్రతాప్ జయంతి నేడు అన్నారు. ఈ ఎన్నికలు నరేంద్ర మోడీ, రాహుల్ గాంధీ మధ్య జరుగుతున్న ఎన్నికలు అన్నారు. ఓట్ ఫర్ జిహాద్, ఓట్ ఫర్ అభివృద్ధి మధ్య జరుగుతున్న ఎన్నికలు ఇవి అని తెలిపారు.

కుటుంబ అభివృద్ధి- దేశవ్యాప్తంగా జరుగుతున్న అభివృద్ధికి మధ్య జరుగుతున్న ఎన్నికలుగా అభివర్ణించారు. రాహుల్ పిల్ల చేష్టల గ్యారంటీ వర్సెస్ మోడీ గ్యారంటీ మధ్య జరుగుతున్న ఎన్నికలు అన్నారు. ఇప్పుడు దేశ వ్యాప్తంగా మోడీ నామస్మరణ వినిపిస్తోందన్నారు. ఇప్పటికే బీజేపీ 200 స్థానాలకు మించి గెలిచిపోయిందని అమిత్ షా అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి తన మాట వినాలని.. ఈ సారి తాము పది కంటే ఎక్కువ సీట్లు గెలవబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో డబుల్ డిజిట్ స్కోర్.. దేశంలో 400 సీట్లకు మార్గం సుగమం అవుతుందని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి దయనీయంగా తయారైందని.. ఆ పార్టీకి పోటీ చేయడానికి అభ్యర్థులు దొరకడం లేదని ఎద్దేవా చేశారు.

అబద్ధాలతో ఎన్నికలు గెలవడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తుందన్నారు. మోడీ మళ్లీ వస్తే రిజర్వేషన్లు తొలగిస్తారని అవాస్తవాలు చెబుతున్నారని ఫైర్ అయ్యారు. ముస్లింల 4 శాతం రిజర్వేషన్లు రద్దు చేసి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు ఇస్తామని మరో సారి క్లారిటీ ఇచ్చారు. రాహుల్ గాంధీ గ్యారంటీలు చెల్లే పరిస్థితి లేదని.. రైతులకు రూ.2లక్షల రుణమాఫీ అమలు కాలేదన్నారు. రైతులకు ఏటా రూ.15 వేల ఆర్థిక సాయం అమలు చేయలేదని అమిత్ షా సీరియస్ అయ్యారు. రైతు కూలీలకు ఏటా రూ.12 వేల ఆర్థిక సాయం నెరవేర్చలేదన్నారు. బీజేపీకి 400 సీట్లు రావాలా.. వద్దా.. మోడీని మూడోసారి ప్రధానిని చేయాలా వద్దా అన్నారు. అని ప్రశ్నించారు. బూర నర్సయ్య గౌడ్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

Next Story

Most Viewed