భారతదేశ గవర్నర్‌ జనరల్‌లు (గ్రూప్స్ స్పెషల్- ఇండియన్ హిస్టరీ )

by Disha Web Desk 17 |
భారతదేశ గవర్నర్‌ జనరల్‌లు (గ్రూప్స్ స్పెషల్- ఇండియన్ హిస్టరీ )
X

విలియం బెంటింక్ (1888-1885):

గవర్నర్‌ జనరల్‌ ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌లో ఒక న్యాయ సభ్యుడు నియమించబడ్డాడు.

(మొట్టమొదటివాడు -లార్ట్‌ మోకాలే)

పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టాడు (1835)

భారతదేశంలో వెండి రూపాయి నాణేన్ని చలామణిలోకి తెచ్చాడు.

మెట్‌కాఫ్‌(1885-386) :

ఇతను వార్తాపత్రికలపై ఆంక్షలను ఎత్తివేసి వాటికి స్వేచ్ఛను కల్పించాడు. అందువల్లనే ఇతనిని “లిబరేటర్‌ ఆఫ్‌ ఇండియన్‌ ప్రెస్" అని అంటారు.

ఆక్లాండ్ (1886-42):

ఇతను తీర్ధయాత్రలపై పన్ను రద్దు చేశాడు.

మొదటి ఆంగ్లో ఆఫ్ఘన్ యుద్ధం ప్రారంభమైంది (1839).

ఎలెన్‌బరో(1842-44):

మొదటి ఆంగ్లో ఆఫ్ఘన్ యుద్ధం ముగిసింది (1842)

1843లో సింధ్‌ను ఆక్రమించాడు

1843లో భారతదేశంలో బానిసత్వంను రద్దు చేశాడు (1813లో ఇంగ్లాండ్‌లో బానిసత్వంను రద్దు చేశారు).

1వ హార్డింజ్‌ (1844-48):

మొదటి ఆంగ్లో సిక్కు యుద్ధం(1844-46)

గోండులను అణచివేశాడు

నరబలి నిషేధ చట్టమును తీసుకువచ్చాడు.

1845లో డేన్స్‌ స్థావరాలను(సేరమ్‌పూర్‌, ట్రావెన్‌కోర్‌) 120 లక్షల రూపాయలకు కొనుగోలు చేశాడు.

డల్హౌసి (1848-1856):

1848లో రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని (Doctrine of Lapse) ప్రవేశపెట్టాడు.

రాజ్య సంక్రమణ సిద్ధాంతం ప్రకారం క్రింది ప్రాంతాలను ఆక్రమించాడు.

1) సతారా

2) జైత్‌పూర్‌

3) సంబల్‌

4) భగత్‌

5) ఉదయ్‌పూర్‌

6) ఝాన్సీ

7) నాగపూర్‌

8) అవద్‌

1850లో Caste Disability Act ను ప్రవేశపెట్టాడు.

1851లో కలకత్తా డైమండ్‌ హార్బర్‌ మధ్య టెలిగ్రాఫ్‌ లైనును నిర్మించాడు.

1852లో కరాచీ వద్ద మొదటి తపాలా బిళ్లను ప్రవేశపెట్టాడు.

1853లో బోంబే-థానేల మధ్య రైల్వే లైన్‌ను నిర్మించాడు (34 కి.మీ. పొడవు)

1854- ఉడ్స్‌ విద్యా డిస్పాచ్‌ (నియంత్రణ బోర్డు అధ్యక్షుడు)

1856లో వితంతు పునర్వివాహ చట్టంను ప్రవేశపెట్టాడు. (1856 డిసెంబర్‌ 7న మొదటి అధికారిక వితంతు పునర్వివాహం జరిగింది)

పబ్లిక్‌ వర్క్స్ డిపార్ట్‌మెంట్‌ను ఏర్పాటు చేశాడు

2వ ఆంగ్లో సిక్కు యుద్ధం (1848-49)

1849లో సిక్కింను ఆక్రమించాడు

లార్డ్‌ కానింగ్‌ (1856-68):

1857లో 3 విశ్వవిద్యాలయాల స్థాపన (కలకత్తా, బాంబే, మద్రాస్‌)

1857 తిరుగుబాటు

1858 భారత ప్రభుత్వ చట్టం వచ్చింది.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed