మా నాన్నను ఓడించండి.. కన్నకొడుకుకు న్యాయం చేయని వాడు ప్రజలకు చేస్తాడా?

by Disha Web Desk 3 |
మా నాన్నను ఓడించండి.. కన్నకొడుకుకు న్యాయం చేయని వాడు ప్రజలకు చేస్తాడా?
X

దిశ ప్రతినిధి, అనకాపల్లి: ఎన్నికల్లో పోటీ చేస్తున్న నాన్నను, అమ్మను గెలిపించేదుకు పుత్ర రత్నాలు అహర్నిశలు కష్టపడడం చూశాం. విచిత్రంగా అనకాపల్లిలో మా నాన్నను ఓడించండీ అంటూ అధికార పార్టీ అభ్యర్ది తనయుడు పిలుపు నిచ్చి సంచలనం సృష్టించారు. వైసీపీ నుంచి అనకాపల్లి ఎంపీ అభ్యర్దిగా డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు బరిలోకి దిగారు.

ఆయన స్ధానంలో మాడుగుల ఎంఎల్‌ఏ సీటును రెండవ భార్య కుమార్తె అనురాధాకు ఇచ్చారు. దీంతో ఆగ్రహం చెందిన మొదటి భార్య కుమారుడు బూడి రవికుమార్ మాడుగుల నుంచి స్వంతంత్ర అభ్యర్దిగా నామినేషన్ దాఖలు చేశారు. అంతటితో ఆగక మా నాన్నను ఓడించండి అని పిలుపునిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ‘‘ కన్న కొడుకుకు న్యాయం చేయలేనివారు ఓటేసిన ప్రజలకు ఏం న్యాయం చేయగలరు?

ఆలోచించి ఓటు వేయండి.. మా నాన్న బూడి ముత్యాల నాయుడిని ఓడించండి’ అని పిలుపు నిచ్చారు. బీజేపీ ప్రత్యర్ది సీఎం రమేష్ నుంచి ఇప్పటికే గట్టి పోటీ ఎదుర్కొంటున్న ముత్యాల నాయుడుకు కన్న కొడుకు నుంచే వ్యతిరేకత వ్యక్తమౌతుండడం ఇప్పుడు అనకాపల్లిలో హాట్ టాపిక్‌గా మారింది.

Next Story

Most Viewed