విమానాల రద్దు ఘటన.. 25 మంది సిబ్బంది తొలగింపు

by Disha Web Desk 4 |
విమానాల రద్దు ఘటన.. 25 మంది సిబ్బంది తొలగింపు
X

దిశ, వెబ్‌డెస్క్: విమానాల రద్దు ఘటనలో ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ సంస్థ 25 మంది సిబ్బందిని తొలగించింది. అయితే సిబ్బంది మూకుమ్మడి సెలవుతో వందకు పైగా విమానాలు రద్దు అయిన విషయం తెలిసిందే. కాగా, అనారోగ్య కారణాలతో 200 మందికి పైగా సిబ్బంది సెలవు పెట్టారు. ఏఐఈ విమానాల రద్దుతో 15 వేల మంది ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ఉద్యోగులతో కంపెనీ వ్యవహరిస్తు్న్న తీరు సరిగా లేదని ఏఐఎక్స్ ఈయూ పేర్కొంది. దీనికి స్పందించిన కారణాలు తెలుసుకోవడానికి సిబ్బందితో యాజమాన్యం చర్చలకు నిర్ణయం తీసుకుంది. తాజా ఘటనతో మే 13 వరకు పరిమితంగా విమానాలు నడపాలని సంస్థ నిర్ణయం తీసుకుంది. దేశీయ, అంతర్జాతీయ విమానాల రద్దుపై పౌరవిమాన యాన శాఖ నివేదిక కోరింది.

Next Story

Most Viewed