Nukaraju : ఫోన్‌లో అన్నీ అలాంటి మెసేజ్‌లే.. అడ్డంగా దొరికిపోయిన జబర్దస్త్ కమెడియన్.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

by Dishafeatures2 |
Nukaraju : ఫోన్‌లో అన్నీ అలాంటి మెసేజ్‌లే.. అడ్డంగా దొరికిపోయిన జబర్దస్త్ కమెడియన్.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
X

దిశ, సినిమా : చూడ్డానికి సన్సియర్‌గా కనిపించే ఓ జబర్దస్త్ కమెడియన్‌ అసలు రంగు బయటపడింది. ఓ వైపు ప్రియురాలు ఉండగానే మరోవైపు ఇంకో అమ్మాయితో రిలేషన్ పెట్టుకున్నాడు. తరచూ ఛాటింగ్‌లు, కాలింగ్‌లలో మునిగిపోతున్నాడు. అయితే అనుకోకుండా అతని మొబైల్ ఫోన్‌ను మొదటి లవర్ చేతికి చిక్కగా అడ్డంగా బుక్కయ్యాడు. ఇంతకీ అతనెవరు? ఏం జరిగింది?

ఫోన్‌లో అలాంటి మెసేజ్‌లు చేస్తూ, చూస్తూ దొరికిపోయిన వ్యక్తి మరెవరో కాదు, జర్దస్త్ కమెడియన్ నూకరాజు. పటాస్ షోతో స్మాల్ స్ర్కీన్ ఎంట్రీ ఇచ్చిన ఇతను మంచి గుర్తింపు తెచ్చుకొని జబర్దస్త్ అనే కామెడీ ప్రోగ్రామ్‌తో మరింత ఫేమస్ అయ్యాడు. ప్రజెంట్ జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలల్లో సందడి చేస్తూ అలరిస్తున్నాడు. అయితే తన కామెడీ స్కిట్స్‌తో నవ్వులు పూయించే నూకరాజు ఇప్పుడు చిక్కుల్లో పడ్డాడు. ఎందుకంటే అతని ఫోన్‌ను ప్రియురాలు ఆసియా తీసుకొని, ఇన్ స్టాగ్రామ్, ఫేస్‌బుక్ పాస్ వర్డ్స్ తీసుకుని మరీ చెక్ చేసింది. అతని ఇన్‌స్టా ఓపెన్ చేయగానే ‘ఏయ్ రిప్లయ్ ఇవ్వు’ అని అవతలి నుంచి ఓ అమ్మాయి పంపిన మెసేజ్ కనబడింది. ఫేస్ బుక్ ఓపెన్ చేయగా ‘హాయ్ బర్త్ డే’ విషెస్ చెప్పు అనే సందేశం కనబడింది. ఇక్కడే అడ్డంగా బుక్కయ్యాడు నూకరాజు. ఆ మెసేజ్‌లు చూసి డౌట్ పడిన అతని నిజమైన ప్రియురాలు ఆసియా ‘నీకు ఎంత క్లోజ్ కాకపోతే ఇలా మెసేజ్ పెడుతుంది. ఎవరామె?’ అని నూకరాజును నిలదీసింది. దీంతో అతను ‘నేను రిప్లయ్ ఇవ్వలేదు కదా’ అంటూ మైక్ విసిరేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అయితే ఈ వివాదం ఎలా ముగుస్తుందో తెలియదు కానీ, ప్రజెంట్ వైరల్ అవుతున్న ఈ వీడియో శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి సంబంధించినదిగా తెలుస్తోంది.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed