- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్‌సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఆమెతో నేను పీకల్లోతు ప్రేమలో ఉన్నాను: దుల్కర్ సల్మాన్ కామెంట్స్ వైరల్
దిశ, సినిమా: మలయాళ నటుడు మమ్ముట్టి, సల్ఫాత్ల కుమారుడు దుల్కర్ అందరికీ సుపరిచితమే. తెలుగులో మహానటి, అందమైన జీవితం, ఓకె బంగారం, సీతారామం వంటి సినిమాల్లో నటించాడు. కానీ సీతారామం సినిమా తర్వాతనే ఇతనికి ఫుల్ క్రేజ్ వచ్చింది. ఈ మూవీతోనే ఒక మంచి హిట్‌ని తన ఖాతాలో వేసుకున్నాడు.
అయితే తాజాగా దుల్కర్ స్టేజ్ పైన తన భార్య గురించి చెప్పిన విషయాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. 2011లో దుల్కర్ సల్మాన్ ఇండస్ట్రీకి రాకముందే అమల్ అనే ఒక నార్త్ ఇండియన్ ముస్లిం కుటుంబం అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అందగాడికి మరొక అందగత్తె తోడుగా దొరికింది అన్నట్టుగా వీరి బంధం నడుస్తుంది.
అయితే తన జీవితంలో అమల్ స్థానం ఎంతో గొప్పదని, ఆమె నా జీవితంలోకి వచ్చాకే నా సినిమా కెరీర్ కూడా మొదలైంది అని ఆమె నా అదృష్ట దేవత అని ఆమె ప్రోత్సాహంతోనే ‘సెకండ్ షో’ అనే సినిమాతో తన కెరీర్ స్టార్ట్ చేశాను.. ఆమె లేకుండా ఈ ప్రపంచాన్ని ఊహించుకోలేను. ఆమెతో నేను పీకల్లోతు ప్రేమలో ఉన్నాను. ఆమెను కాకుండా మరొక అమ్మాయిని నా జీవితంలో ఊహించుకోలేను అంటూ ఒక స్టేజ్ పై దుల్కర్ తన భార్య మీద ఉన్న ప్రేమను బయటపెట్టారు. కాగా వీరికి 2017 లో ఒక పాప పుట్టింది.