‘పుష్ప’తో నాకు ఒరిగిందేమీ లేదు.. నటుడి సంచలన కామెంట్స్

by Dishafeatures3 |
‘పుష్ప’తో నాకు ఒరిగిందేమీ లేదు.. నటుడి సంచలన కామెంట్స్
X

దిశ, సినిమా : అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన ‘పుష్ప’ రికార్డ్స్ బద్ధలు కొట్టింది. ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీసును షేక్ చేసింది. ఫారినర్స్ కూడా తగ్గేదేలే డైలాగ్‌కు రీల్స్ చేయగా.. మొత్తానికి బన్నీ ట్రెండ్ సెట్ చేశాడు. అయితే ఇందులో పోలీస్ ఆఫీసర్ షెకావత్‌గా నటించిన కోలీవుడ్ స్టార్ ఫహాద్ ఫాజిల్ కూడా తన స్టైల్‌తో ఆడియన్స్‌ అటెన్షన్ క్యాచ్ చేయడంలో సక్సెస్ అయ్యాడు. షెకావత్‌ అనే రోల్ గుర్తుండిపోయేలా చేశాడు. కానీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమా గురించి కాస్త నెగెటివ్‌గా మాట్లాడటాన్ని తెలుగు ప్రేక్షకులు తట్టుకోలేకపోతున్నారు.

విషయం ఏంటంటే.. ‘‘పుష్ప’ వల్ల నా కెరీర్‌కు కొత్తగా యాడ్ అయింది ఏమీ లేదని అనుకుంటున్నా. ఈ విషయం డైరెక్టర్ సుకుమార్‌కు కూడా చెప్పా. నేను ఏదీ దాచిపెట్టాలని అనుకోవట్లేదు. నిజాయితీగా ఉంటాను’ అని చెప్పుకొచ్చాడు. అయితే దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘ఈయన అలా అంటాడేంటి. నెక్స్ట్ పార్ట్‌లో క్యారెక్టరైజేషన్ ఇంకా గొప్పగా ఉంటుంది కదా’ అంటున్నారు.కానీ మరికొందరు మాత్రం ఆయన చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అని మద్దతు ఇస్తున్నారు. మాలీవుడ్‌లో వరుస బ్లాక్ బస్టర్స్ అందుకుంటున్న ఫహాద్‌కు ‘పుష్ప’వల్ల ఒరిగిందేమీ లేదని అభిప్రాయపడుతున్నారు.



Next Story

Most Viewed