కత్తి నేనే.. నెత్తురు నాదే.. వామ్మో విజయ్ దేవరకొండలో ఈ యాంగిల్ కూడా ఉందా!

by Disha Web Desk 7 |
కత్తి నేనే.. నెత్తురు నాదే.. వామ్మో విజయ్ దేవరకొండలో ఈ యాంగిల్ కూడా ఉందా!
X

దిశ, సినిమా: రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఇటీవల ‘ఫ్యామిలీ స్టార్’ సినిమాతో అలరించిన విషయం తెలిసిందే. బ్యూటీఫుల్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం అనుకున్నంత రేంజ్‌లో సక్సెస్ కాలేకపోయింది. అయినప్పటికీ మన రౌడీ హీరో క్రేజ్ మాత్రం కొంచెం కూడా తగ్గడలేదు. వరుస పరాజయాలు ఎదుర్కొంటున్నప్పటికీ.. ఆఫర్లు తన చుట్టూ తిరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రస్తుతం రెండు, మూడు సినిమాలతో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది.

అంతే కాకుండా ఈ రోజు విజయ్ బర్త్‌డే కావడంతో.. ఆయన నటిస్తున్న సినిమాల నుంచి వరుస పోస్టర్లు రిలీజ్ చేస్తున్నారు చిత్ర బృందం. మైత్రీ మూవీ బ్యానర్‌లో విజయ్ ‘VD14’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఓ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం నుంచి తాజాగా స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు చిత్ర బృందం. ఈ మేరకు ‘ఇతిహాసాలు వ్రాయబడలేదు, అవి యోధుల రక్తంలో నిక్షిప్తమై ఉన్నాయి. #VD14 - ది లెజెండ్ ఆఫ్ ది కర్స్డ్ ల్యాండ్ ప్రదర్శిస్తున్నాము’ అనే క్యాప్షన్ ఇచ్చిన పుట్టినరోజు శుభాకాంక్షలు దేవరకొండ అంటూ పోస్ట్ పెట్టారు. ఈ మూవీలో విజయ్ రాజుల కాలంలో యోధుడిగా కనిపించబోతున్నాడని తెలుస్తోంది.

దీంతో పాటు.. రవి కిరణ్ కోలా దర్శకత్వంలో కూడా విజయ్ ఓ మూవీ ప్రకటించిన విషయం తెలిసిందే. ‘SVC59’ అనే వర్కింగ్ టైటిల్‌తో వస్తున్న ఈ మూవీని దిల్ రాజు నిర్మాణంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం నుంచి కూడా తాజాగా పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ మేరకు ‘కత్తి నేనే.. నెత్తురు నాదే.. యుద్ధం నాతోనే’ అనే క్యాప్షన్‌తో షేర్ చేసిన ఈ పోస్టర్ ప్రస్తుతం నెట్టింట వైరల్ కావడంతో.. కొంత మంది మూవీపై అంచనాలు పెంచేవిధంగా ఉందంటూ కామెంట్స్ పెడుతుంటే.. మరికొందరూ మాత్రం.. వామ్మో విజయ్ దేవరకొండలో ఈ యాంగిల్ కూడా ఉందా అంటూ స్పందిస్తున్నారు.

Read More...

నేను మిస్ చేసుకున్న మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది.. నేచురల్ స్టార్ నాని కామెంట్స్ వైరల్

Next Story

Most Viewed