viral : మరో క్షణం ఆలస్యమైనా ప్రాణం పోయేది.. ఇంతలోనే ఆ చిన్నారిని.. (వీడియో)

by Dishafeatures2 |
viral : మరో క్షణం ఆలస్యమైనా ప్రాణం పోయేది.. ఇంతలోనే  ఆ చిన్నారిని.. (వీడియో)
X

దిశ, ఫీచర్స్ : అదొక విమానశ్రయం. సమయం ఉదయం పదకొండు దాటి ఉండవచ్చు. వచ్చీ పోయే జనాలతో ఇక్కడి ప్లాట‌ఫారమ్ ఫుల్ రష్‌గా ఉంది. తమ తమ గమ్యస్థానాలకు చేరాల్సిన ప్రయాణికులు ఒక్కొక్కరిగా చేరుకుంటున్నారు. ఇంతలో ఓ ముచ్చటైన జంట, మూడేళ్ల చిన్నారితో అక్కడికి వచ్చింది. అందరూ వాళ్లను గమనించినప్పటికీ, క్యూట్‌గా, యాక్టివ్‌గా కనిపిస్తున్న ఆ చిన్న పిల్లవాడి వైపే ఎక్కువగా చూస్తూ వెళ్తున్నారు. క్షణాలు, నిమిషాలు గడిచిపోతూ ఉన్నాయ్. ఎవరి హడావిడిలో వాళ్లు నిమగ్నం అయ్యారు. చిన్నారితో వచ్చిన జంట కూడా ఫోన్లు చెక్ చేస్తూ, మాట్లాడుతూ బిజీ అయిపోయింది. తమ పక్కనే ఉన్నా గారాల బిడ్డను ఓ కంట కనిపెడుతూనే ఉన్నారట పేరెంట్స్ ఇద్దరూను. కానీ వారు జస్ట్ కాసేపు అటు తిరిగారో లేరో ఆ అల్లరి పిల్లోడు క్షణాల్లో మాయమైపోయాడు. అతన్ని గమనించడంలో గనుక మరో క్షణం ఆలస్యమైతే ప్రాణం పోయేది. ప్రజెంట్ ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఏం జరిగిందంటే..

చిలీలోని శాంటియాగో అంతర్జాతీయ విమానాశ్రయంలో పేరెంట్స్‌తో ఉన్న మూడేళ్ల చిన్నారి ఆడుకుంటూ వెళ్లి దగ్గరలోని లగేజీ కన్వేయర్ బెల్ట్‌పై ఎక్కి కూర్చున్నాడు. అది కదులుతూ ముందుకు పోవడంతో ఆ చిన్నారి కూడా చాలా దూరం వెళ్లిపోయాడు. అయితే పేరెంట్స్ మాత్రం ఇదంతా గమనించలేదు. వాళ్లు తేరుకునే సరికి అక్కడ చిన్నారి కనబడపోవడంతో వెంటనే అలర్ట్ అయి రోదిస్తూ వెతకసాగారు. ఇది చూసిన ఎయిర్ పోర్టు సిబ్బంది కూడా వెతకడం ప్రారంభించగా కదులుతున్న కన్వేయర్ బెల్టుపై ఉన్నట్లు గుర్తించారు. పరిస్థితి చూస్తుంటే ఆ చిన్నారి మరికొద్ది క్షణాల్లో ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది. కానీ ఈ లోగా ఎయిర్ పోర్ట్ సిబ్బంది అక్కడి కన్వేయర్ బెల్టుకు సంబంధించిన రోల్స్ అన్నీ దాటుకుంటూ వెళ్లి మరీ చిన్నారి ప్రాణాలు కాపాడారు. ప్రజెంట్ ఈ వీడియోను @crazyclipsonly అనే IDతో సోషల్ మీడియాలో షేర్ చేయగా, అది నెటిజన్ల హృదయాలను కదిలిస్తోంది. చూసిన వారిలో అలర్ట్‌నెస్ పెంచుతోంది. ‘క్షణం ఆలస్యమైతే ప్రాణాలు గాలిలో కలిసేవి కదా’ అంటూ కొందరు, ‘పేరెంట్స్ ఇది చూసైనా అలర్ట్ అవ్వండి. మీ పిల్లలు జాగ్రత్త’ అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.

Next Story

Most Viewed