ధోని కాళ్ళు పట్టుకున్న ముంబై బౌలర్..అంబానీ చూస్తేనా!

by velandi.Saikiran |   (  Updated:2026-04-22 17:13:44  IST  )

ధోని కాళ్ళు పట్టుకున్న ముంబై బౌలర్ దీప‌క్ చాహ‌ల్ వీడియో వైర‌ల్ గా మారింది.

ధోని కాళ్ళు పట్టుకున్న ముంబై బౌలర్..అంబానీ చూస్తేనా!
X

దిశ‌, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2026లో మరో కీలక పోరు రేపు జరగనుంది. పలుమార్లు ఛాంపియన్ గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడనున్నాయి. రేపు సాయంత్రం ఏడున్నర గంటలకు వాంఖడే స్టేడియం వేదికగా రెండు జట్ల మధ్య మ్యాచ్ ఉండనుంది. ఈ నేపథ్యంలో మహేంద్ర సింగ్ ధోని నెట్స్ లో వికెట్ కీపింగ్ తో పాటు బ్యాటింగ్ ప్రాక్టీస్‌ చేస్తూ కనిపించాడు. అటు ముంబై ఇండియన్స్ ప్లేయర్లు కూడా నెట్స్ లో చెమటోడ్చుతున్నారు.

ఇలాంటి నేపథ్యంలో మహేంద్ర సింగ్ ధోని కాళ్లు మొక్కుతూ మెరిశాడు ముంబై బౌలర్ దీపక్ చాహర్. గతంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరఫున దీపక్ ఆడిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా ధోని సూచనలతో స్టార్ బౌలర్ గా ఎదిగాడు దీపక్ చాహర్. అందుకే తాజాగా ధోని కాళ్లు మొక్కుతూ కనిపించాడు. అయితే, ఈ వీడియోపై చెన్నై అభిమానులు ర‌క‌ర‌కాలుగా కామెంట్స్ పెడుతున్నారు. గురువు కాళ్లు బాగానే ప‌ట్టుకున్నావ్ కానీ, అంబానీ చూస్తుండ‌గా ఈ ప‌ని చేస్తే బాగుండు అంటూ ఆడుకుంటున్నారు. ప్రాక్టీస్ చేస్తోన్న నేప‌థ్యంలో అంబానీ చూడ‌బోడ‌ని తెలివిగా ధోని కాళ్లు ప‌ట్టుకున్నార‌ని మ‌రి కొంత‌మంది కామెంట్స్ చేస్తున్నారు.

సిగరెట్ తాగుతూ దొరికిన‌ గుజరాత్‌ ప్లేయర్‌

Next Story