అలర్ట్ : కాఫీని అస్సలే తాగకూడని వారు ఎవరో తెలుసా?

by Disha Web Desk 8 |
అలర్ట్ : కాఫీని అస్సలే తాగకూడని వారు ఎవరో తెలుసా?
X

దిశ, ఫీచర్స్ : కాఫీలు, టీలు అంటే ఇష్టపడని వారు ఎవరు ఉంటారు చెప్పండి. ఉదయం లేస్తే చాలు చాలా మంది ఎంతో ఇష్టంగా కాఫీ,టీ తాగుతుంటారు. ముఖ్యంగా కొందరికి కాఫీ అంటే చాలా ఇష్టం ఉంటుంది. దీంతో వారు ప్రతి రోజూ.. రోజులో రెండు లేదా మూడు సార్లు కాఫీ తాగడానికి ఇష్టపడుతుంటారు. అయితే ఇలా కాఫీ తాగడం ఆరోగ్యానికి అస్సలే మంచిది కాదంట. ముఖ్యంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ప్రతి రోజూ కాఫీ తాగడం వల్ల చిక్కుల్లో పడే ఛాన్స్ ఉందని అంటున్నారు నిపుణులు. కాగా, ఎవరు కాఫీ తాగకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.

గర్భిణీ స్త్రీలు కాఫీకి చాలా దూరంగా ఉండాలి. వీరు కాఫీ తాగితే రక్తస్రావం లాంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందంటున్నారు నిపుణులు. ఎందుకంటే కాఫీలో కెఫిన్ ఎక్కువగా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి అస్సలే మంచిది కాదు. దీని వలన చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ముఖ్యంగా కొంత మంది అధిక రక్తపోటు, బీపీతో బాధపడుతుంటారు. అయితే అలాంటి వారు కూడా కాఫీకి చాలా దూరంగా ఉండాలి. లేకపోతే ఇది చాలా ఇబ్బందులకు గురిచేస్తుంది. అలాగే డయాబెటిస్ ఉన్న వారు నిత్యం కాఫీ తాగడం వలన వారిలో షుగర్ లెవల్స్ పెరిగే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందంటున్నారు నిపుణులు. అదే విధంగా గుండె జబ్బులతో బాధపడే వారు. అధిక ఒత్తిడికి గురి అయ్యే వారు అస్సలే కాఫీ తాగకూడదంట, దీని వలన అనేక ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందని చెబుతున్నారు వైద్యులు. ముఖ్యంగా కాఫీ అనేది రక్త పోటును పెంచుతుంది. అందువలన గుండె సమస్యలతో బాధపడేవారు సాధ్యమైనంత వరకు కాఫీకి దూరంగా ఉండటం ఆరోగ్యానికి చాలా మంచిదంట.

Next Story

Most Viewed