ఓటుతో శిక్షించు

by Disha edit |
ఓటుతో శిక్షించు
X

ఓటరు మహాశయా..!

మతం మత్తులో దిగకు...

కులం రొచ్చులో పడకు.

తాయిలాలకు తలొగ్గకు..

భవిష్యత్తును బుగ్గి చేసుకోకు..

మద్యం సీసాకు ఓటు అమ్ముకోకు

పొర్లు దండాలకు పొంగిపోకు

గెలిచాక నువ్వెవరంటారని మరువకు

నేతల పాపాలను ఓటుతో శిక్షించు

నీ ఓటుతో....

సంక్షేమానికి సమ్మతించు

అభివృద్ధిని ఆమోదించు

అవినీతిని అంతమెుందించు

రాజకీయాల్లో నేరస్థులను శిక్షించు

ప్రజాస్వామ్య భారతాన్ని రక్షించు

మిమ్మల్ని ఆడించిన నేతలను..

ఓడించే సమయం ఆసన్నమైంది

ఎన్నికల మాహా యజ్ఞంలో..

నీ ఓటుతో అవ్వాలి

నేరస్థుల ప్రవేశం భగ్నం

- పి.సాంబశివారెడ్డి

63017 84542

Next Story

Most Viewed