అక్షయ తృతీయరోజు ఈ వస్తువులను ఇంట్లో ఉంచకూడదు.. అవి ఏంటో తెలుసా..

by Disha Web Desk 20 |
అక్షయ తృతీయరోజు ఈ వస్తువులను ఇంట్లో ఉంచకూడదు..  అవి ఏంటో తెలుసా..
X

దిశ, ఫీచర్స్ : మరో రెండు రోజుల్లో అక్షయ తృతీయ పండుగను జరుపుకోనున్నాం. ఈ పండగను జరుపునే ముందు కచ్చితంగా కొన్ని నియమాలను తెలుసుకోవాలి. ఎందుకంటే ఆ పర్వదినం రోజున పూజలో ఎలాంటి ఆటంకాలు ఉండకూడదు. అందుకే అక్షయ తృతీయ పండుగకు ముందు ఇంట్లో కొన్ని వస్తువులు ఉంచకూడదు. ఇంట్లో ఈ వస్తువులు ఉంటే మీ జీవితం పై చెడుప్రభావం కలుగుతుందని చెబుతున్నారు పండితులు. దీంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడాల్సి వస్తోందంటున్నారు.

పండగల ముందు ఇళ్లను శుభ్రం చేసుకోవడం ఆనవాయితి ఉంటారు. అలాగే ఇంటిలో ఉన్న పాత వస్తువులను కూడా తీసేసి బయట పారేస్తూ ఉంటారు. అలాగే అక్షయ తృతీయకు ముందు కూడా వాస్తు దోషాలను కలిగించే కొన్ని పాత వస్తువులను ఇంటిలో నుంచి బయట పడేయాలని చెబుతున్నారు పండితులు. అప్పుడే ఆ పండగరోజున ఏర్పడిన యోగాన్ని సద్వినియోగం చేసుకోవచ్చని చెబుతున్నారు. అక్షయ తృతీయ రోజున ప్రతి ఇంటిలో లక్ష్మీదేవిని పూజించే సంప్రదాయం ఉంది. ఆ సమయంలో లక్ష్మీ దేవిని పూజించే ప్రదేశాన్ని పరిశుభ్రంగా చేసుకోవాలంటున్నారు పండితులు.

ఇంటి నుండి ఈ వస్తువులను తొలగించండి..

ప్రతి ఇంట్లో చీరుపు తప్పనిసరిగా ఉంటుంది. అయితే ఆ చీపురును హిందూ మతంలో ఎంతో పవిత్రమైనదిగా, లక్ష్మీదేవిగా భావిస్తారు. అంతే కాదు కొన్ని ప్రత్యేకమైన పండుగల రోజున చీపురును పూజిస్తారు. ఇంట్లో చీపురు ఉండటం వల్ల ఇంటిలో లక్ష్మి వస్తుందని నమ్ముతారు. అందుకే పండగ సమయంలో ఇంటిలో కొత్తగా, మంచిగా ఉన్న చీపురును ఉంచుతారు. విరిగిన చీపురును ఇంట్లో ఎప్పుడూ ఉంచకూడదు. విరిగిన చీపురు వలన ఆ కుంటుంబంలో అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుంది.

ఎండిన మొక్కలను ఉంచవద్దు..

ఇంట్లో మొక్కలను పెంచాన్నిశుభప్రదంగా పరిగణిస్తారు. అయితే కొన్ని సార్లు మొక్కలు ఎండిపోతూ ఉంటాయి. అలాంటి మొక్కలను అస్సలు ఇంట్లో ఉంచకూడదంటున్నారు పండితులు. ఇంట్లో ఎండిన మొక్కలు ఉంటే వాస్తు దోషాలు కలుగుతాయని చెబుతున్నారు పండితులు.

పాత, చిరిగిన చెప్పులు, బూట్లు..

ఇంట్లో పాత చెప్పులు, చిరిగిన బూట్లు అస్సలు ఉండకూడదట. అవి ఇంట్లో ఉంటే డబ్బుకు కొరత ఏర్పడుతుందట. అక్షయ తృతీయకు ముందు ఇంటి నుండి పాత, చిరిగిన బూట్లు, చెప్పులు బయట పడేయాలంటున్నారు పండితులు.

మురికి బట్టలు..

అలాగే మురికి బట్టలు, చిరిగిన బట్టలు ఇంట్లో అస్సలు ఉండకూడదు. మురికి బట్టలను ధరించడం వలన జీవితంలో దురదృష్టం కలుగుతుందని చెబుతారు.

ఇంట్లో చెడు దృష్టి..

ఎప్పుడూ కూడా పగిలిన, ఆగిపోయిన గడియారాన్ని అస్సలు ధరించకూడదు. అలాగే ఇంట్లో గడియారాన్ని కూడా ఆపేసి ఉంచకూడదు. ఇలా చేయడం ద్వారా బ్యాడ్ టైం నడుస్తుంది. ఇలాంటి వాటిని అక్షయ తృతీయకు ముందు ఇంటి నుండి తీసివేయండి.

గమనిక : ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకున్నది. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.

Next Story

Most Viewed