- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అఖండ 2 ఓటీటీ డేట్ వచ్చేసింది...ఎప్పుడంటే ?
అఖండ 2 సినిమాను త్వరలోనే ఓటీటీలో రిలీజ్ చేయబోతున్నారట. సంక్రాంతి కానుకగా జనవరి రెండో వారంలో ఈ మూవీని

దిశ, వెబ్ డెస్క్: నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ 2 సినిమా థియేటర్లలో ప్రభంజనం సృష్టిస్తోంది. బోయపాటి శ్రీను, నందమూరి బాలయ్య కాంబినేషన్ లో వచ్చిన ఈ మూవీ డిసెంబర్ 12వ తేదీన రిలీజ్ అయి, కేవలం మూడు రోజుల్లోనే రూ. 100 కోట్ల కలెక్షన్స్ క్రాస్ చేసినట్లు చెబుతున్నారు. హిందూ ధర్మం, మత సామరస్యం , ఆధ్యాత్మికత లాంటి అంశాలు చుట్టూ ఈ సినిమా కథ ఉన్న నేపథ్యంలో జనాలు ఆసక్తిగా చూసేందుకు థియేటర్లకు వెళ్తున్నారు.
చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ టికెట్ కొనుగోలు చేసి సినిమా తిలకిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఈ మూవీలో మంచి మాస్ మసాలా దంచేశారు. అయితే థియేటర్లలో ఇరగదీస్తున్న అఖండ 2 సినిమాను త్వరలోనే ఓటీటీలో రిలీజ్ చేయబోతున్నారట. సంక్రాంతి కానుకగా జనవరి రెండో వారంలో ఈ మూవీని తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఒకవేళ జనవరి రెండో వారంలో వస్తే మాత్రం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుందట.
Read More..
వారణాసిలో ప్రకాష్ రాజ్ పాత్ర ఇదే..ఇక చరిత్రలో మిగిలిపోనుంది !






