కోర్సు ఫీజులను 30-40 శాతం తగ్గించిన బైజూస్

by Dishanational1 |
కోర్సు ఫీజులను 30-40 శాతం తగ్గించిన బైజూస్
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ ఎడ్‌టెక్ దిగ్గజం బైజూస్ కీలక నిర్ణయం తీసుకుంది. సంస్థ వ్యవస్థాపకుడు బైజూ రవీంద్రన్ రోజువారీ కార్యకలాపాల బాధ్యతలు తీసుకున్న తర్వాత పునరుద్ధరణ ప్రక్రియలో భాగంగా కోర్సు సబ్‌స్క్రిప్షన్ల ఫీజులను గణనీయంగా తగ్గించారు. ఇదే సమయంలో సేల్స్ ఇన్సెంటివ్స్‌ను 50-100 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల 1,500 మంది సేల్స్ అసోసియేట్స్, మేనేజర్లతో జరిగిన సమావేశంలో బైజూ రవీంద్ర తన కొత్త వ్యూహాన్ని పంచుకున్నారు. ఇందులో భాగంగా సంస్థ సామర్థ్య పెంపుతో పాటు సులభతరం చేసేలా చర్యలు తీసుకున్నారు. తాజా నిర్ణయాల ప్రకారం, బైజూస్ లెర్నింగ్ యాప్‌లో వార్షిక సబ్‌స్క్రిప్షన్ ఇప్పుడు పన్నులు కలుపుకుని ఏడాదికి రూ. 12,000 తగ్గింపు లభించనుంది. అదనంగా బైజూస్ తరగతులు, బైజూస్ ట్యూషన్ సెంటర్లు ఏడాది మొత్తానికి వరుసగా రూ. 24,000, రూ. 36,000కి అందుబాటులో ఉంటాయి. పలు నివేదికల ప్రకారం, ఇది గణనీయంగా 30-40 శాతం తగ్గింది. అలాగే, ప్రోత్సాహకాలను అందించడం ద్వారా సేల్స్ టీమ్‌కు ఇవ్వాల్సిన పెండింగ్ బకాయిలను పరిష్కరిస్తూ, సేల్స్ ఇన్సెంటివ్స్‌ను 50-100 శాతం పెంచినట్టు సమాచారం.

Next Story

Most Viewed