74 విమానాలను రద్దు చేసిన ఎయిర్ ఇండియా

by Disha Web Desk 17 |
74 విమానాలను రద్దు చేసిన ఎయిర్ ఇండియా
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ విమానయాన సంస్థ ఎయిర్‌ ఇండియా గురువారం 74 విమానాలు రద్దు చేసినట్లు ప్రకటించింది. క్యాబిన్ సిబ్బంది కొరత కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. ఇటీవల కాలంలో ఎయిర్‌లైన్స్ సిబ్బంది అనూహ్యంగా సెలవులు పెడుతుండటంతో ఎయిర్ ఇండియా రోజు రోజుకు తన విమానాలను తగ్గించుకుంటూ వస్తుంది. ప్రస్తుతం 20 రూట్లలో 292 విమాన సర్వీసులను నడుపుతున్నట్లు పేర్కొంది. రద్దు చేయబడిన విమానాలు దేశీయ, అంతర్జాతీయ మార్గాల్లో ఉన్నాయి. చెన్నై నుండి కోల్‌కతా, చెన్నై నుండి సింగపూర్, తిరుచ్చి నుండి సింగపూర్, జైపూర్ నుండి ముంబైకి వెళ్లాల్సిన కీలక మార్గాల్లో అనేక విమానాలు కూడా ఆలస్యం అయ్యాయి.

రెండు రోజుల క్రితం 300 మంది సీనియర్ క్యాబిన్ సిబ్బంది చివరి నిమిషంలో అస్వస్థకు గురై తమ ఫోన్లు ఆఫ్ చేయడంతో దాదాపు 100 కి పైగా విమానాలు రద్దు చేశారు, దీంతో సుమారు 15,000 మంది ప్రయాణికులు ప్రభావితమైనట్లు సమాచారం. ఇలాంటి చర్యల కారణంగా ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని, సిబ్బంది చర్యల వలన ఎయిర్‌లైన్‌కు ప్రతిష్టకు నష్టం వాటిల్లుతుందని ఎయిర్‌ ఇండియా తెలిపింది. టాటా గ్రూప్ ఆధ్వర్యంలోకి వచ్చినప్పటి నుంచి సంస్థను సమస్యలు వెంటాడుతున్నాయి. జీతాల విషయంలో సిబ్బంది గత కొంత కాలంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీంతో మూకుమ్మడిగా సెలవులు పెడుతున్నారు.

Next Story

Most Viewed