AP Elections 2024:ఏపీలో ఆ పార్టీదే అధికారం..రెండు సర్వేల్లో వచ్చిన రిజల్ట్ ఇదే!

by Disha Web Desk 18 |
AP Elections 2024:ఏపీలో ఆ పార్టీదే అధికారం..రెండు సర్వేల్లో వచ్చిన రిజల్ట్ ఇదే!
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌కు నాలుగు రోజులే ఉండటంతో అన్ని పార్టీలు గెలుపే లక్ష్యంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రచారంలో భాగంగా ప్రజలకు తమ మేనిఫెస్టోలో ఉన్న పథకాల గురించి వివరిస్తూ అన్ని పార్టీల అభ్యర్థులు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఇక ఎన్నికల్లో భాగంగా ఏ పార్టీకి ఎన్ని సీట్లు గెలవబోతుందనే దానిపై పలు సంస్థలు సర్వేలు నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా రెండు సర్వే రిపోర్ట్‌లు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

ఈ సర్వే రిపోర్ట్‌లో ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుచుకుంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఎలక్ట్రోరల్, పాలిమెట్రిక్స్ అనే సర్వే రిపోర్టులు ఏం చెబుతున్నాయంటే..ఈ ఎలక్ట్రోరల్ సర్వేలో ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి 110 నుంచి 120 సీట్లు వస్తాయని స్పష్టం చేసింది. అలాగే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి 55 నుంచి 60 స్థానాలు వస్తాయని చెప్పింది. ఈ మేరకు దాదాపు 50 శాతం వైసీపీకి ఓటు షేరింగ్ ఉంటుందట. అలాగే టీడీపీ కూటమికి 43.5% ఓట్ పర్సెంట్ ఉంటుందట. కాంగ్రెస్ పార్టీకి ఒక్క శాతం మాత్రమే ఓట్లు వస్తాయని ఈ సర్వే వెల్లడించింది.

ఇది ఇలా ఉంటే పాలిమెడ్రిక్స్ సర్వే రిపోర్టులో కూడా అధికార వైసీపీ పార్టీ మరోసారి అధికారంలోకి తేలిపోయింది. ఈ సర్వే రిపోర్టులో కూడా వైసీపీ పార్టీకి 115 సీట్లకు పైగా వస్తాయని తేలిపోయింది. అటు టీడీపీ కూటమికి 39 స్థానాలు మాత్రమే వస్తాయని మరో 23 స్థానాలలో టఫ్ ఫైట్ ఉంటుందని ఈ సర్వే సంస్థ స్పష్టం చేసింది. ఈ రెండు సర్వేల ప్రకారం చూసుకున్నట్లయితే ఏపీలో వైసీపీ పార్టీ మరోసారి అధికారంలోకి రాబోతున్నట్లు తెలుస్తుంది. వాస్తవానికి ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనేది జూన్ 4 తేలిపోతుంది.

Read More..

AP Politics:ఈ ఎన్నికలు ఐదేళ్ల భవిష్యత్త్‌ని నిర్ణయిస్తాయి..సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed