చర్చకు సిద్ధమా.. బాలకృష్ణకు మంత్రి బొత్స సవాల్

by Disha Web Desk 16 |
చర్చకు సిద్ధమా.. బాలకృష్ణకు మంత్రి బొత్స సవాల్
X

దిశ, వెబ్ డెస్క్: విద్యతెలియని వ్యక్తి విద్యాశాఖ మంత్రిగా ఉండటం దురదృష్ణకరమని హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ విజయనగరం జిల్లా చీపురుపల్లిలో చేసిన వ్యాఖ్యలపై మంత్రి బొత్స స్పందించారు. బాలకృష్ణ ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్‌ను చదివారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు తగ్గాయన్న బాలకృష్ణ వ్యాఖ్యలపై తాను చర్చకు తాను సిద్ధమని చెప్పారు. అందుకు బాలకృష్ణ సిద్ధమా అని సవాల్ విసిరారు. ఏపీలోని విద్యావ్యవస్థ దేశంలో ఎక్కడా లేదని తెలిపారు. టోఫెల్, ఇంగ్లీష్ మీడియం వంటి విధానాలతో కొత్త సంస్కరణలకు శ్రీకారం చుట్టామని తెలిపారు. పేదలందిరికీ విద్యనందించడమే తమ లక్ష్యమని చెప్పారు. కొందరు కుట్ర చేయడం వల్లే పింఛన్లు సమయానికి ఇవ్వలేని పరిస్థితి ఉందని, వృద్ధుల ఉసురు పోసుకుంటున్నారని మంత్రి బొత్స వ్యాఖ్యానించారు. భూమిపై యజమానులకు పూర్తి భద్రత కల్పించడమే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉద్దేశమని మంత్రి బొత్స పేర్కొన్నారు. ప్రస్తుతం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కోర్టు పరిధిలో ఉందని, తీర్పు వచ్చిన తర్వాతే అమలుపై నిర్ణయం తీసుకుంటామని మంత్రి బొత్స స్పష్టం చేశారు.

Read More..

వైసీపీకి భారీ షాక్..ముగ్గురు మాజీ కార్పొరేటర్‌లు జనసేనలో చేరిక


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed